Latest scam: మీ పిల్లలకు రోడ్డు యాక్సిడెంట్! కొత్త తరహా సైబర్ మోసం.. సజ్జనార్ ట్వీట్

by Ramesh N |
Latest scam: మీ పిల్లలకు రోడ్డు యాక్సిడెంట్! కొత్త తరహా సైబర్ మోసం.. సజ్జనార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడంతో నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పద్దతులను తెరమీదకు తీసుకువస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకోకుండా అవగాహన కల్పించే క్రమంలో తాజాగా ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) మరో ఆసక్తికర విషయం పోస్ట్ చేశారు. (New type of cyber fraud) కొత్త తరహా సైబర్ మోసం.. జాగ్రత్త అంటూ సజ్జనార్ హెచ్చరించారు.

‘మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్‌కు గురయ్యారని తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ చేస్తారు. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, తక్షణమే సర్జరీ చేయాలంటూ మాయమాటలు చెబుతారు. సర్జరీ కోసం వెంటనే డబ్బులు పంపాలంటూ కేటుగాళ్ళు లింకులను షేర్ చేస్తారు. ఆ లింకులను క్లిక్ చేయగానే బ్యాంక్ ఖాతాల నుంచి నగదును గుల్ల చేస్తున్న మోసగాళ్ళు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్‌కి స్పందించొద్దు. సైబర్ మోసాలపై కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి’ అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed