యథేచ్చగా గనుల తవ్వకాలు.. అక్రమ గనుల తవ్వకాల్లో ఎవరికీ ఎంత వాటా...?

by Aamani |
యథేచ్చగా గనుల తవ్వకాలు.. అక్రమ గనుల తవ్వకాల్లో ఎవరికీ ఎంత వాటా...?
X

దిశ,బషీరాబాద్ : ఎలాంటి అనుమతులు లేకుండా నాపరాతి గనులను అక్రమంగా తవ్వకాలు జరుపుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే నాపరాతిని అక్రమార్కులు కొనసాగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.బషీరాబాద్ మండల పరిధిలోని క్యాద్గిరా, జీవన్గి,కోర్విచెడ్,ఎక్మయి గ్రామాల గనులలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నాపరాళ్లు తవ్వేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక ఇష్ట రాజ్యాంగ తవ్వకాలు చేపడుతూ సరిహద్దులు దాటిస్తున్నారు. లీజులు, యల్టీలు లేకుండా నాపరాయి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడు కరవైయ్యారు. రాజకీయాల గురించి మాట్లాడే నేతలు, వర్గపోరులో ముందుండే నాయకులు అక్రమ గనుల తవ్వకాలలో మాత్రం ములాఖత్ అయ్యారని స్థానికంగా జనం మండిపడుతున్నారు.

రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సరిహద్దున గల బషీరాబాద్ మండలంపై ఉన్నతాధికారులు పెద్దగా నజర్ పెట్టకపోవడంతో దళారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. స్థానిక అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో అధికారుల తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నాపరాళ్లను తరలిస్తూ అక్రమార్కులు లక్షలు లక్షలు గడిస్తున్నారు. మరికొందరు పట్టా భూములు ఉండటంతో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నాపరాళ్ల తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట నాపరాళ్లు వెలికితీతకు భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపడుతున్నారు. మండలానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే అధికారుల తీరుపై ఆరోపణలు వచ్చాయి.రెవెన్యూ, మైన్స్‌ అధికారులు క్షేత్రసాయికి వెళ్లి అక్రమ తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story