మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో 'మిల్లెట్ ఎక్స్‌పీరియన్స్ హబ్' ప్రారంభం

by Disha Web Desk 11 |
మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో మిల్లెట్ ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభం
X

దిశ, గండిపేట్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మిల్లెట్ మార్వెల్స్ భారత్‌లో మొదటి 'మిల్లెట్ ఎక్స్‌పీరియన్స్ హబ్' ను బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేశామని బిజెపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డాన్ బాస్కోనగర్‌లో శనివారం మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో 'మిల్లెట్ ఎక్స్‌పీరియన్స్ హబ్' ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… అధిక పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన మిల్లెట్లు ఈ ప్రసిద్ధ స్నాక్స్‌కు ఆరోగ్యకరమైన రుచిని అందిస్తాయన్నారు.‌ మిల్లెట్ చాట్ రుచులు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సంతోషకరమైన కలయికను అందిస్తుందన్నారు. ఇది అందరికీ ప్రత్యేకమైన, మనోహరమైన భోజన అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఇది యువతకు ఆరోగ్య స్పృహతో కూడిన ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. ఇది ఫాస్ట్ ఫుడ్స్ కు దూరం చేస్తుందన్నారు. భారతదేశంలో ఏకైక ప్రామాణికమైన మిల్లెట్ కిచెన్‌గా మిల్లెట్ మార్వెల్స్ నిలుస్తుందని చెప్పారు. ఇది ఏకైక రెస్టారెంట్ చైన్, 'నో వైట్స్' విధానాన్ని సమర్థిస్తుందని తెలిపారు.

మైదా, తెల్ల చక్కెర, తెల్ల బియ్యం, తెల్ల ఉప్పు తదితర పదార్ధాలను దూరంగా ఉంచుతుందన్నారు. మిల్లెట్ మార్వెల్స్ భారత్‌లో మొట్టమొదటి యూఎస్డీఏ, బీఆర్సీ ఆటోమేటెడ్ వాక్యూమ్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిచయం చేస్తుందన్నారు. ఇది 'మిల్లెట్ సిక్స్ ప్యాక్ - సిక్స్ డేస్, సిక్స్ మిరాకిల్స్' అనే వినూత్న కాన్సెప్ట్‌కు మార్గదర్శకంగా ఉందన్నారు. మిల్లెట్స్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని అన్నారు. చేవెళ్ల లాంటి వర్ష బావ ప్రాంతాలు మిల్లెట్స్ సాగు అధిక లాభాలను ఇస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు మిల్లెట్స్ సాగు ఎగుమతులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

కేంద్ర ప్రభుత్వం చేవెళ్ల లో మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్, న్యూట్రిషన్ హబ్ ను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిల్లెట్స్ సాగు ఎగుమతులతో అధిక లాభాలు పొందవచ్చు అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మిల్లెట్ మార్వెల్స్‌‌ ఫౌండర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, మూవీ ఆర్టిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షుడు గోకుల్ మహేష్ యాదవ్, మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed