దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి.. బిభవ్ అరెస్ట్ పై కేజ్రీవాల్ రియాక్షన్

by Prasad Jukanti |   ( Updated:2024-05-20 10:51:53.0  )
దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్  చేసుకోండి.. బిభవ్ అరెస్ట్ పై కేజ్రీవాల్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీపై కెజ్రీవాల్ ఘాటు విమర్శలు చేశారు. ఆప్ నేతలను జైల్లో పెట్టడమే బీజేపీ టార్గెట్ అని ధ్వజమెత్తారు. స్వాతిమాలివర్ పై దాడి పేరుతో ఆమ్ ఆద్మీపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. స్వాతిమాల్ వెనుక ఉన్నది బీజేపీ పెద్దలే అని ఆమె త్వరలోనే బీజేపీ కార్యాలయాన్ని టచ్ చేస్తుందన్నారు. స్వాతిమాలివార్ పై దాడి చేసిన ఘటన కేసులో ఇవాళ కేజ్రీవాల్ పీఏ బిభవ్ అరెస్ట్ పై కేజ్రీవాల్ శనివారం మీడియాతో మాట్లాడారు. మోడీ జైలు గేమ్ ఆరడుతున్నారని ఆప్ నేతలను కేసుల పేరుతో తొక్కెయడమే వారి టార్గెట్ అని ధ్వజమెత్తారు. ఒకరి తర్వాత మరోకరిని జైలుకు పంపుతున్నారని ఇప్పుడు నా తర్వాత నా పీఏ బిభవ్ ను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. మరో వైపు రేపు మధ్యహ్నం 12 గంటలకు తనతో పాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆప్ నేతలంతా బీజేపీ కార్యార్యాలయానికి వస్తామని అప్పుడు మీరు మమల్ని జైల్లో పెట్టవచ్చని సవాల్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టవచ్చని అనుకుంటున్నారా? అలా చేసి పార్టీని అణగదొక్కుదామని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story