అవి చూపించాలని కోరిన నెటిజన్.. షేప్ లేదు ఏం లేదు, భరించండంటూ నభా నటేష్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-05-18 14:07:37.0  )
అవి చూపించాలని కోరిన నెటిజన్.. షేప్ లేదు ఏం లేదు, భరించండంటూ నభా నటేష్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి మూవీనే హిట్ కావడంతో నభా నటేష్‌కు ప్లస్ అయింది. వరుస ఆఫర్స్‌తో బిజీ బ్యూటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు నిఖిల్ ‘స్వయంభు’ చిత్రంతో నభా నటేష్ రీ ఎంట్రీ ఇస్తుంది.

అయితే ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే చిట్ చాట్ నిర్వహించి అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా, ఓ నెటిజన్ నభా నటేష్‌ను గోర్లు చూపించమని కోరాడు. దీంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా నో అని చెప్పకుండా అభిమాని కోరికను తీర్చింది. ‘‘కట్ చేయలేదు, ఏం చేయలేదు.. భరించండి’’ అని క్యాప్షన్ జత చేసి గోర్లను చూపిస్తున్న ఫొటో షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed