- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ సభ అట్టర్ ప్లాప్.. రూ.600 ఇస్తామన్నా రాని జనం..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : సమయం అయిపోయాక సాధ్యం కానీ కోరికలు కోరితే ఎట్లా..? వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తేనే అభివృద్ధి చేస్తాం, లేదంటే లేదు. అనేలా తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆశాలపైనే కాక, నియోజకవర్గ ప్రజల ఆశలపై కూడా నీళ్లు చల్లి నట్లు అయ్యింది. గురువారం జిల్లా కేంద్రంలో రూ.96 కోట్లతో నిర్మించబోయే నూతన బ్రిడ్జి పనులకు శంకుస్థాపన, రూ. 60 కోట్లతో వికారాబాద్ మున్సిపల్ రోడ్ల అభివృద్ధి లాంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని పాత స్టోరే మల్లి చెప్పిన మంత్రి వికారాబాద్ అభివృద్ధికి మాత్రం రూపాయి నిధులు ప్రకటించలేదు.
అప్పటికి స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోరిన తీరని కోరికను సైతం మంత్రి మరిచిపోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఆనంద్ అడిగిన వికారాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడం, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అభివృద్ధి, అనంతగిరిని పర్యాటక క్షేత్రం లాంటి కోరికలు ఇప్పట్లో తీర్చలేనని మంత్రి కేటిఆర్ నిర్మొహమాటంగా చెప్పారు. సమయం లేదు మిత్రమా మల్లి గెలిస్తేనే అభివృద్ధి, 4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతుందని మంత్రి చెప్పడం ఎమ్మెల్యే ఆనంద్ కు అయన వర్గం నేతలు నిరాశను మిగిల్చిందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దాంతో ఎమ్మెల్యే ఆనంద్ కు ఓటమి భయం పట్టుకుందని, మంత్రి కేటిఆర్ బహిరంగ సభ ఇంతకు ఆనంద్ ను గెలిపించడానికి పెట్టారా..? కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ను గెలిపించడానికి పెట్టాడా..? అని కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.
రూ.600 ఇస్తామన్నా రాని జనం..!
జిల్లా కేంద్రంలో జరిగిన మంత్రి కేటీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని జిల్లా కేంద్రంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 20 వేల మంది జనం పట్టే బ్లాగ్ రగ్రౌడ్ లో సభ పెడితే, కేవలం 5 వేల మంది జనం రాలేదంటే ఎమ్మెల్యే ఆనంద్ గెలుపు ఏ మేరకు సాధ్యం అవుతుందో అర్ధం చేసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రూ.600 ఇస్తామన్నా అనుకున్న స్థాయిలో జనసమీకరణ జరగకపోవడం, సభ ప్రాంగణం సగం నిండకపోవడంతో ఎమ్మెల్యే ఆనంద్ నిరాశ చెందాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్యే ఆనంద్ చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యంత అవినీతిపరుడు ఎవరైనా ఉంటే అది ఆయనే అన్నట్లుగా ప్రసాద్ కుమార్ పేరు చెప్పకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఒక్క భూమిని నలుగురికి అమ్మి దళిత మంత్రిని అని బెదిరించాడని, శాటిలైట్ సిటీ పేరుతో కమిషన్లు తీసుకుంటే కాంట్రాక్టర్ భయపడి వెళ్లిపోయాడని విమర్శించాడు. ఇదిలాఉంటే కెటిఆర్ సభకు హాజరు కావడానికి వస్తున్న ధారూర్ మండలం, రాంపూర్ తండాకు చెందిన ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆటోలలో స్థాయికి మించి జనాన్ని తీసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు.
రూ.2,700 కోట్ల పైచిలుకు అభివృద్ధి ఎక్కడ..?
వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వచ్చాక రూ.2,700 కోట్ల పైచిలుకు అభివృద్ధి జరిగిందని మంత్రి కేటిఆర్ భహిరంగ సభ సాక్షిగా చెప్పడంతో నోర్లు తెరవడం నియోజకవర్గ ప్రజల వంతైదని చెప్పాలి. హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న వికారాబాద్ అభివృద్ధిలో వెనుకబడిందని ప్రజలు బాధపడుతుంటే, స్వయానా మంత్రి, ఎమ్మెల్యే ఆనంద్ నాతో ఇప్పుడే అన్నాడని, రూ.2,700 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. దాంతో ప్రజలే కాదు బిఆర్ఎస్ నేతలు సైతం అయోమయానికి గురయ్యారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన నిధులను కూడా అభివృద్ధి అంటే ఎట్లా సారూ అంటూ సెటర్లు వేస్తున్నారు.