- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కీచక ఉపాధ్యాయుడు
దిశ, పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ పండితుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు… కళాశాలలో చదువుతున్న విద్యార్తులపట్ల బాడ్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం బయటకు రావడంతో పెద్దేముల్ గ్రామ యువకులు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్సై గిరి భారీ బందోబస్తుతో కళాశాలకు చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పి బయటకు పంపించారు.
అంతలోనే సదరు లెక్చరర్ ను యువకులు చితకబాదారు. సరైన వివరాలు వెల్లడించాలని జిల్లా ఇంటర్మీడియట్ సమన్వయ అధికారి (నోడల్ ఆఫీసర్) శంకర్ నాయక్, పై యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ సమన్వయ అధికారి శంకర్ నాయక్, కొమ్ము రజిత విద్యార్థులని కౌన్సిలింగ్ చేశారు. అనంతరం విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు హిందీ లెక్చరర్ జమిల్ ను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. వెంటనే సదరు లెక్చరర్ ను బర్తరఫ్ చేసి కేసు నమోదు చేయాలని యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరి అన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి
విద్యార్థులతో మాట్లడినం. చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంఘటన మా దృష్టికి రావడంతో ఈ రోజు కళాశాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడినం. ఇక్కడ జరిగిన సంఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతామని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ వివరించారు.