- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలిక కు న్యాయం చేయాలి
దిశ, మీర్ పేట్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక (16) సోమవారం రోజు అత్యాచారానికి పాల్పడిన ఘటన కు నిరసనగా.. పలు ప్రతిపక్ష పార్టీ నాయకులు నందనవనం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. మైనర్ బాలిక కు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత బాలిక కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రంగా రెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీ రాములు యాదవ్, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి, ఎల్ బి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి,లింగోజి గూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పలువురి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.