- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలి
దిశ, ప్రతినిధి వికారాబాద్ : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదా బిల్లు, ఎల్ఆర్ఎస్ పై అవగాహన కార్యక్రమంతో పాటు జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సభాపతి మాట్లాడుతూ... సామాన్య ప్రజానిక సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్నేహపూర్వకంగా, సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రెండు కళ్లల్లాగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. రాబోయే 5 సంవత్సరాలలో జిల్లా ఎంతగానో అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆయన తెలిపారు.
జిల్లాలో పరిశ్రమలు, విద్యారంగ అభివృద్ధితో పాటు రూ.400 కోట్ల నిధులతో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసినట్టు చెప్పారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరిగినట్లయితే నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రతినెలా ముఖ్యమైన శాఖలపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమీక్ష నిర్వహించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు.
గతంలో ధరణి ద్వారా ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. భూముల సమస్యలను సత్వర పరిష్కారానికి భూమాత చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. భూమాత చట్టం పటిష్టంగా నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావి వర్గం, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల సలహాలను పరిగణనలోకి తీసుకుని భూముల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగకుండా కింది స్థాయిలోనే పరిష్కార దిశగా భూమాత ద్వారా సాధ్యమవుతుందన్నారు. 2014 కంటే ముందు ఉన్న సాదాబైనామా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. వర్షాకాలంలో చెరువులు, కుంటలు ఎన్ని నిండాయి, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుతామో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
పశు సంపదను సంరక్షించుకునే బాధ్యతలో వాక్సినేషన్ కు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి సూచించారు. గురుకుల పాఠశాలలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మంచి నీటిని సంమృద్ధిగా అందేలా, స్వచ్ఛమైన నీటిని అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగ్నా నది ద్వారా మంచి నీరును అందించే దిశగా మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, విద్యుత్తు, మైనింగ్, అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, పరిగి, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, మున్సిపల్ చైర్ పర్సన్ లు మంజుల రమేష్, స్వప్న పరిమల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్లు, ఎంపీడీవో లు పాల్గొన్నారు.