- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శేరిలింగంపల్లిలో అత్యధికం.. కొడంగల్‌లో అతితక్కువ
దిశ, రంగారెడ్డి బ్యూరో: 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడు రోజుల పాటు జరిగిన మద్యం అమ్మకాల్లో రూ.116కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 93,725 లిక్కర్.. 1,18,447 బీర్ కేసులు విక్రయించారు. కానీ గతేడాది ఈ మూడు రోజుల్లో రూ.117.32 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 98,266 లిక్కర్.. 1,03,538 బీర్ల కేసులు సేల్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2023 డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో, 2024 డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో విక్రయించిన మద్యం సేల్‌తో పోలిస్తే రూ.1కోటి 12లక్షల ఆదాయం నష్టం వచ్చినట్లు తెలుస్తున్నది.
శంషాబాద్ సర్కిల్లోనే అత్యధిక ఆదాయం..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా్లో మూడు ఎక్సైజ్ సర్కిల్లున్నాయి. అవి సరూర్ నగర్, శంషాబాద్, వికారాబాద్ సర్కిళ్లు కాగా.. వీటి పరిధిలో 14 పోలీస్ స్టేషన్లున్నాయి. శంషాబాద్ సర్కిల్లో మూడు పోలీస్ స్టేషన్లుండగా శంషాబాద్, శేరిలింగంపల్లి పూర్తిగా అర్బన్, చేవెళ్ల రూరల్ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే అర్బన్ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల్లో విక్రయాలు జోరుగా జరిగినట్లు తెలుస్తున్నది. శంషాబాద్ సర్కిల్ పరిధిలో 41,414 లిక్కర్, 53337 బీర్ కేసులు విక్రయిస్తే రూ.56.77కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. కానీ ఒక్క శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే 18,766 లిక్కర్.. 25,503 బీర్ కేసులు విక్రయిస్తే రూ.28.69 కోట్లు వచ్చింది. ఈ స్టేషన్ పరిధిలో లిక్కర్ కంటే బీర్ కేసులు అత్యధికంగా విక్రయించినట్లు తెలుస్తున్నది. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లుండగా.. సరూర్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అమన్‌గల్, షాద్ నగర్ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఈ సర్కిల్ పరిధిలో సరూర్ నగర్ తప్పా మిగిలిన ఐదు పోలిస్ స్టేషన్లు రూరల్ ప్రాంతంలోనే ఉన్నాయి. 42,563 లిక్కర్.. 49,966 బీర్ కేసులు విక్రయిస్తే రూ.49.58 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. వికారాబాద్ సర్కిల్ పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూర్, మోమిన్ పేట్, కొడంగల్ పోలీస్ స్టేషన్లున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో 9748 లిక్కర్.. 15,144 బీర్ కేసులు విక్రయిస్తే కేవలం రూ.9.75 కోట్ల ఆదాయంతో సర్ధుకున్నారు. కానీ అదే సీఎం నియోజకవర్గమైన కొడంగల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1026 లిక్కర్.. 2255 బీర్ కేసులు విక్రయిస్తే రూ.1.13 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే లిక్కర్ 4 శాతం సేల్ తగ్గింది. కానీ 28శాతం బీర్ల విక్రయం పెరిగింది.
తగ్గిన ఎక్సైజ్ ఆదాయం..
రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఆశించిన స్థాయిలో డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో ఆదాయం రాలేదనే చర్చ సాగుతున్నది. సాధారణంగా రోజువారీగా వచ్చే ఆదాయంలాగే నూతన సంవత్సర వేడుకలు జరిగినట్లు తెలుస్తున్నది. పెద్దగా మద్యం సేల్ లేదని లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు నగరానికి అతి దగ్గరలో ఉన్నందున ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు గెట్ టు గెదర్ పార్టీలు పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది వేడుకలు భారీగా జరిగినట్లు కనిపించినా మద్యం సేల్ పెద్దగా లేదని తెలుస్తున్నది. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా జరిగిన సేల్‌ను కూడా దాటలేదని అధికారులు అంచనాలు వేస్తున్నారు.