పరివర్తన చెందితే రౌడీషీట్​ తొలగింపు : జిల్లా ఎస్పీ కోటి రెడ్డి

by Sumithra |
పరివర్తన చెందితే రౌడీషీట్​ తొలగింపు : జిల్లా ఎస్పీ కోటి రెడ్డి
X

దిశ, పరిగి : నేర చరిత్ర కలిగి ఉండి రౌడీషీటర్​ అనే ముద్ర కలిగిన వారిలో పరివర్తన వస్తే రౌడీషీట్​ తొలగించేందుకు వీలుంటుందని జిల్లా కోటి రెడ్డి అన్నారు. పరిగిలోని స్వాగత్​ రెసిడెన్సీలో సోమవారం ' హిస్టరీ షీటర్స్​ మేళ ' 'నేరచరిత్ర కలిగన వ్యక్తుల మేళ ' కార్యక్రమం నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ ఎన్​.కోటి రెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో నేరాలు చేసి రౌడీషీట్​ పేరొందిన వ్యక్తలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా, క్రమశిక్షణ పొంది మార్పు వచ్చినట్లు నిరూపించుకుంటే వారిరై ఉన్న రౌడీషీట్​ తొలగించుకునే అవకాశం ఉందన్నారు.

అంతేకుండా రౌడీషీట్​ ఉన్న వ్యక్తలు అనారోగ్యానికి గురై, 60 ఏళ్లు పై బడిన వారు ఎస్​ఐ, సీఐ, డీఎస్పీకి తొలగించాలని (ఆర్జీ) అభ్యర్తించవచ్చు. పరివర్తన రాకుండా అల్లర్లు కొనిసాగిస్తే వారిని రౌడీషీటర్లగానే పరిగినిస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలపై రౌడీషీటర్ల అవగాహన కల్పించారు. పరిగి డీఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి, పరిగి, కోడంగల్​ సీఐలు వెంకట్రామయ్య, బి.శంకర్​, ఎస్​ఐలు పి.విఠల్​ రెడ్డి, భీం కుమార్​, విశ్వజన్​, గిరి, రవి, నయీం, రమేష్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed