కుండపోతగా వర్షం.. అండర్ పాస్‌లో చిక్కుకున్న కారు

by Aamani |
కుండపోతగా వర్షం.. అండర్ పాస్‌లో చిక్కుకున్న కారు
X

దిశ, కొత్తూరు : సాయంత్రం ఆకాశాన్ని నల్లని మేఘాలు కమ్మెయ్యడంతో మండల వ్యాప్తంగా కుండ పోతగా వర్షం కురుస్తునే ఉంది. సిద్దాపూర్, ఎస్ బీ పల్లి, కొడిచెర్ల, పెంజర్ల, ఇన్ములనర్వ, వైఎమ్ తండా మిగతా ఇతర గ్రామాల తో పాటు పాటు మండలం కేంద్రంలో భారీ వర్షం కురిసింది. గంటల తరబడి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్యనే ప్రారంభించిన అండర్ పాస్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. అది గమనించని కారు డ్రైవర్ అందులో నుండి వెళ్లే ప్రయత్నం చెయ్యగా ఎక్కువగా నీరు ఉండడంతో ఆ కారు అందులో చిక్కుకుపోయింది. చివరగా స్థానికుల సహాయంతో కారు ని బయటికి తీశారు.అండర్ పాస్ లో నీళ్లు నిలవడంతో ఇతర వాహనాలు పెంజర్ల చౌరస్తాలో నుండి యూటర్న్ తీసుకుని వెళ్తున్నాయి . దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Next Story