- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియాతో అధికారం రాదు..చర్లపల్లి జైలుకెళ్ళడం ఖాయం : Revanth Reddy
దిశ, వెబ్ డెస్క్ : రుణమాఫీలో రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ లను కలువాలని, రోడ్డెక్కవద్దని.. బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొవద్దన్నారు. కష్టపడి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంపై అధికారం కోల్పయిన బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా దుమ్మెత్తే పోస్తున్నారని మండిపడ్దారు. రవీంద్రభారతిలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి సభలో రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. సోషల్ మీడియాను నమ్ముకుని అధికారంలోకి వస్తమని కేటీఆర్ కలలు కంటున్నాడని, సోషల్ మీడియాతో అధికారంలోకి రాడుగాని, చిల్లర పనులు చేస్తే మాత్రం చర్లపల్లి జైలులో చిప్పకూడు తినడం ఖాయమని నేను గ్యారంటీగా చెబుతున్నానని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రజలు ఏ రకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 20ఏళ్ళ ప్రతిపక్ష నేతగా ఇల్లు కోల్పయిన పేదల బాధ తెలియకుండానే నేను ఇంతదూరం రాలేదన్నారు.
కాళేశ్వరం పేరుతో మీ కుటుంబం లక్ష కోట్లు మింగిందని, ఈ మూసీ నిర్వాసితుందరిని ఆదుకోవడానికి 10వేల కోట్లు కావని, ఆ 10వేల కోట్లు లేని దరిద్రంలో ప్రభుత్వం లేదన్నారు. కేటీఆర్, హరీశ్, రాజేందర్ లతో కూడిన ప్రభుత్వ కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సెక్రటేరియట్ కు వచ్చి తమ అనుభవాలతో సలహాలివ్వాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో పెడుదామన్నారు. లేదంటే మూసీ ప్రక్షాళన వద్దు మూసేద్దామని చెబితే అదైనా చెప్పండని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళలో 11వేల కోట్లు రుణమాఫీ చేస్తే పాతిక రోజుల్లో మేం 18వేల కోట్ల మాఫీ చేశామని, అ సన్నాసీ కేటీఆర్ ఈరోజు రుణమాఫీ కాలేదని దీక్ష చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.
- Tags
- revanth reddy