BEL Recruitment: 12.5 లక్షల వార్షిక వేతనంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
BEL Recruitment: 12.5 లక్షల వార్షిక వేతనంతో భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్.. డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence)కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) ద్వారా మొత్తం 229 ఇంజినీర్ పోస్టులను ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్(Fixed Tenure Basis)పై భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజినీర్ - 229

విద్యార్హత:

పోస్టును బట్టి బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉతీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1-11-2024 నాటికి 28 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, అంబాలా, బటిండా, ముంబై, వైజాగ్, ఢిల్లీ, ఇండోర్, ఘజియాబాద్ నగరాల్లో విధులు నిర్వహించాలి.

దరఖాస్తు ఫీజు :

అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 400+GST, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed