- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు ప్రజల నీరాజనం..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రతిపేదవాడి పేరున ఉన్న లావణి పట్టా భూములను అమ్ముకునేలా జీవో తీసుకురావడమే కాక, ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహించారన్నారు. మాజీ సర్పంచ్ బోయిని శివయ్య ఆధ్వర్యంలో గ్రామంలో గల డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తిరిగి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కళ సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్ మెంట్ భూములకు క్రయవిక్రయ హక్కులు కల్పిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలను పీడించి కార్పొరేట్ బడాబాబులకు దోచిపెడుతుందని దేశ ప్రజలు ఈ విషయన్ని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, కమల్ రెడ్డి, ఎంపీటీసీ అనసూజా ,మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, అనంత్ రెడ్డి, జాఫర్, రఘుపతి రెడ్డి, మనోహర్ గౌడ్, అయూబ్ అన్సారీ, జంగయ్య, బస్వారాజ్, హన్మంత్, శ్రీనివాస్ ముదిరాజ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.