- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
దిశ,తలకొండపల్లి : సమాజంలోని పేద ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే లక్ష్యంతోనే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందజేశారు. తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన చెన్న కేశవులుకు, పెద్దయ్య యాదవ్ కు, అమంగల్ లోని పత్య నాయక్, పోలేపల్లిలోని శ్రీను నాయక్ లకు మంజూరైన చెక్కులను తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ తో కలిసి అందజేశారు. అనంతరం తలకొండపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది సుభాష్ చంద్రబోస్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందడంతో మృదేహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు, ఆయా గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.