- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు..
దిశ, తాండూరు రూరల్ : పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన సౌకర్యాలకు నోచుకోకపోవడంతో ప్రతీ నిత్యం కార్యాలయాలకు వచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలను నిర్మించటంలో పాలకులు విఫలమవుతున్నారు. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం, గనులు భూగర్భ జల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నా, సరైన సౌకర్యాలు లేక అధికారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం పాత తాండూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో ఓ ప్రైవేట్ భవనంలో ఇరుకు గదుల మధ్యన ఉండటంతో ప్రతి నిత్యం రిజిస్ర్టేషన్‌కు వచ్చేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కార్యాలయం వద్ద పార్కింగ్ లేకపోవడంతో రహదారి పైనే వాహనాలు నిలపడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పోతే గనులు భూగర్భ వనరుల శాఖ కార్యాలయం మాత్రం పట్టణ శివారులోని ఓ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కొనసాగుతుంది. దీంతో ఆ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని తాండూరు ప్రజలు కోరుతున్నారు.
అప్పటి కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపనలు..!
అప్పటి కాంగ్రెస్ హయాంలో నూతన భవనాల నిర్మాణం కోసం ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ పనులు భూగర్భ జలా వనరుల శాఖ మంత్రి నేటి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి చేతుల మీదుగా గనులు భూగర్భ జల శాఖ, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోలేదు.
ప్రత్యేక రాష్ట్రంలో సొంత భవనాలు కరువు
రాష్ట్రానికి ఆర్థిక వనరులు కలిగిన ఈ శాఖల భవనాలు మాత్రం అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. నాపరాతి గనులు పరిశ్రమల సబ్ రిజిస్టర్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికి అంతా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సైతం చర్యలు చెప్పటకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ సేవలు అందించే కార్యాలయాలకు మాత్రం ప్రభుత్వ సొంత భవనాలు నిర్మించాకపోవడం లేదని అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
ఆయా కార్యాలయాలకు సొంతభవనాలు లేక అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భవనాలు కార్యాలయాలకు ఏ మాత్రం అనుకూలంగా లేక ఇటు ప్రజలు, అటు అధికారులు ఏళ్ల కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అద్దె పెంచుతున్న యజమానులు తదనుగుణంగా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఆ దిశగా ఒత్తిడి తేవడంలో ప్రభుత్వ శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.