తాండూరు పురపాలక అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి..

by Kalyani |
తాండూరు పురపాలక అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి..
X

దిశ, తాండూరు : జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీలో తాండూరు మున్సిపాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణలు హాజరయ్యారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కారులు విడుదల చేస్తున్న నిధులపై, అభివృద్ధి,పనుల పురోగతిపై చర్చించారు.ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు పట్టణ అభివృద్ధికి ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని తాండూరు మున్సిపల్ కు అధిక నిధులు కేటాయించాలని ఎంపీలను కోరారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed