- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
15 ఎకరాలు కాదు ఐదెకరాలే!
దిశ, గండిపేట్: గండిపేట్ మండల పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురైన పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పట్టించుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు చూసీ చూడనట్లు గా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమంగా చెరువులు, కుంటలను కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కబ్జాదారుల అత్యాశతో స్థానికంగా చెరువులు కుచించుకు పోతున్నాయి. అయినా అధికారులు మాత్రం అటువైపు తొంగి చూడటం లేదు. ఇక ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు తెలుస్తున్నది.
కుచించుకపోతున్న గౌని చెరువు..
గండిపేట మండల పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి లోని సర్వేనెంబర్ 91 లోని గౌని చెరువు రోజురోజుకు కుచించుకుపోతుంది. ఈ చెరువు 15 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా.. ప్రస్తుతం ఐదు ఎకరాలకే పరిమితం కావడం అధికారుల నిర్లక్ష్యానికి, అక్రమార్కుల అత్యాశకు అద్ధం పడుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమార్కులు ఇదే విధంగా రెచ్చిపోతే మిగిలిన ఆ ఐదు ఎకరాలు కూడా ఎవరికీ కనిపించకుండా పోతుందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. వట్టినాగులపల్లి లోని సర్వేనెంబర్ 114 లో ఎర్రకుంట చెరువు 17 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కాగా ఎర్రకుంట నిండిన తర్వాత గౌని చెరువు నిండుతుంది. ప్రజా ప్రతినిధులు ఈ భూములను కబ్జాలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో వర్షాలు వస్తే రెండు చెరువులు నిండి మిగిలిన వరద కారణంగా పక్కనే ఉన్న కాలనీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చెరువుల స్థలాలు కబ్జాలకు గురవుతున్న ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
కబ్జాదారులు ఇచ్చే చిల్లరకు ఆశపడి ప్రజాప్రతినిధులు, అధికారులు సదరు నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కానీ స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. వరదలు ముంచుకొచ్చినప్పుడు కాలనీలు చెరువులను తలపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పత్రికల్లో ఇదే అంశాన్ని లేవనెత్తగా అధికారులు సర్వే చేసి కబ్జాలు ఎక్కడా జరగలేదని గూగుల్ మ్యాప్స్‌లో చూసి వెళ్లిపోయేవారు. కానీ ప్రస్తుతం చెరువు 15 ఎకరాల 22 గుంటల నుంచి కేవలం 5 ఎకరాలకే పరిమితం కావడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. మరి కబ్జాలు కానప్పుడు ఐదు ఎకరాలకే చెరువు ఎలా పరిమితం అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా బృందం ఈ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందా? అని స్థానికులు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని గౌని చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
మామూళ్ల మత్తులో..
స్థానికంగా చెరువులు కబ్జాలకు గురవుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు మామూళ్ల కోసం మౌనంగా ఉంటున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణలను నిజం చేసేలా అధికారుల ప్రవర్తన గోచరిస్తున్నది. ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులకు ఈ చెరువుల గురించి అవగాహన ఉందా? లేదా? అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ని ఏర్పాటు చేసి ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ గౌని చెరువును సైతం అధికారులు కాపాడుతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Telugu news