పింఛన్ కోసం పదేళ్లుగా పడిగాపులు…పట్టించుకోని అధికారులు

by Kalyani |
పింఛన్ కోసం  పదేళ్లుగా పడిగాపులు…పట్టించుకోని అధికారులు
X

దిశ, శంకర్పల్లి : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని పదేళ్లు గడుస్తున్న అధికారులు కనికరించడం లేదని మోకిల గ్రామానికి చెందిన చాకలి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. శంకరపల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన చాకలి నరసింహులు వయసు రీత్యా సుమారు 75 సంవత్సరాలు గురువారం మోకిల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని దిశ ప్రతినిధి సందర్శించగా అధికారులకు మొరపెట్టుకునేందుకు వచ్చిన నరసింహులు తన ఆవేదనను వెలిబుచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 65 సంవత్సరాలకు పైబడిన వారందరికీ ప్రభుత్వం పింఛన్ మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ అర్హత వయసును 57 సంవత్సరాలకు కుదించారు.

మోకిల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నానని ఎంతోమంది సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు మారుతున్నప్పటికీ ఎవరికీ తనపై జాలి కలగడం లేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మోకిల గ్రామపంచాయతీలో అధికారులకు అడిగితే శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయానికి మీ దరఖాస్తు పంపించామని చెబుతున్నారని అక్కడికి కూడా వెళ్లి వాకబ్ చేశానని నాకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి పింఛన్ మంజూరు చేస్తున్న అధికారులు తనపై ఎందుకు కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని కుమారుడు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడని తెలిపారు.

ఎకరం పొలం తనకు జీవనాధారం అని అయినా అందరి మాదిరిగా కోట్లకు పడగలెత్తలేదని పేదవాడికి కనీసం నెలకు రూ. 2000 పింఛన్ మంజూరు చేయాలని అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ ఎవరు తనపై జాలి చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కార్యదర్శికి, గ్రామపంచాయతీ కారోబార్ కి కూడా ఫిర్యాదు ఇచ్చానని మోకిలలో అడుగుతే శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో అడగాలని చెబితే అక్కడికి కూడా వెళ్లానని ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఇవ్వడం లేదు. నెలరోజులు ఆగు 15 రోజులు ఆగు రెండు నెలలు ఆగు అంటూ సమాధానం చెబుతున్నారని నరసింహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అర్హులైన వారికి పింఛన్ అందేటట్లు చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరుతున్నారు.

Next Story