- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం.. రూ.లక్షల్లో నష్టం
దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని మెరుపల్లె లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలం మారేపల్లి గేట్ సమీపంలోనీ సుమిత్ర కాటన్ మిల్లు లో ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మంటలు అంటుకొని పొగలు కొమ్ముకోవడం జరగడంతో పత్తి దగ్ధమైంది. దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాటన్ మిల్లు నిర్వాహకులు సిబ్బంది వీరారెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని సుమిత్ర కాటన్ జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మిల్లులో నిల్వ చేసుకున్న పత్తి దగ్ధమైంది.
గురువారం రాత్రి పని ముగించుకొని మిల్లు నిలిపివేసి కార్మికులు వారి నివాసాలకు వెళ్లిన తరువాత మిల్లులో నిల్వ ఉంచిన పత్తిలో పొగలు రావడంతో వెళ్లి చూసేసరికి పత్తి మంటల్లో కలుతుందని నిర్ధారించుకొని తమ దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడం తో కొంత మేరకు ప్రమాదం తప్పి మిల్లు లో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం కారణంగా సుమిత్ర కాటన్ మిల్లులో పత్తి, అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని మిల్లు నిర్వాహకులు మిల్లు సిబ్బంది వీరారెడ్డి అంచనా వేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..