పల్లెల్లో ఫామ్‌ల్యాండ్స్.. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు

by Aamani |
పల్లెల్లో ఫామ్‌ల్యాండ్స్.. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు
X

దిశ,చేవెళ్ల : సాధారణంగా ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే అధికారులు సవాలక్ష నిబంధనలు పెడతారు. ఆ ధ్రువపత్రం కావాలి..? ఈ అధికారి అనుమతి కావాలి? అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. అదే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం అధికారులకు నిబంధనలు పట్టవు. కనీసం వారి వైపు కూడా తిరిగి చూడరు. చేవెళ్ల మండలంలో పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు వెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లను వెంచర్‌గా వ్యాపారం చేస్తున్నారు. స్థానిక అధికారులకు ఏమీ పట్టనట్టుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చేవెళ్ల మండలంలో ఆలూర్, దామరగిద్ద, తంగడ్‌పల్లి గ్రామాల్లో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే దర్జాగా వెంచర్ చేసి ఫామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓ వెంచర్ నిర్మించాలంటే అందుకు ప్రభుత్వం నుంచి ఐదు రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది. ఈ ధ్రువపత్రాలను వివిధ శాఖల నుంచి తీసుకొచ్చి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చి వారి అనుమతి పొందాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ముందు వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముద్దాం.. ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాం.. అన్నట్లుగా వివరిస్తున్నారు రియల్ వ్యాపారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

ఉండాల్సిన పత్రాలివే..

వెంచర్‌కు సంబంధించిన ఆర్డీవో నుంచి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి పత్రం తీసుకోవాలి. గ్రామ కార్యదర్శి పత్రం, ఈసీ రిజిస్ట్రేషన్ డాక్

ఇండివిడ్యువల్ అప్రూవల్, మండల సర్వేయర్ ఇచ్చే టీపోప్లాన్ రిపోర్ట్ అనే ఐదు రకాల ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. కానీ కేవలం కొంత మంది వెంచర్ నిర్వాహకులు ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని విభజిస్తున్నారు. ఈ ఐదు రకాల ధ్రువపత్రాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఇచ్చి వారి అనుమతి పొందాలి.

పంచాయతీ అనుమతి కోసం..

ఇందుకోసం వెంచర్ వేసే భూమిలో 10 శాతం గ్రీన్ బెల్ట్ కోసం గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. అలాగే ఆ వెంచర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవ్వని పూర్తి చేసే వరకు మరో 10 శాతం భూమిని పంచాయతీకి అప్పగించాలి. వెంచర్ మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన తర్వాత సదరు భూమిని రిలీజ్ చేయించుకోవాలి.

Advertisement

Next Story