రైతులను నిండా ముంచుతున్న కమిషన్ ఏజెంట్లు..

by Sumithra |
రైతులను నిండా ముంచుతున్న కమిషన్ ఏజెంట్లు..
X

దిశ, పరిగి : మార్కెటింగ్ శాఖ అధికారులు, పరిగి కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై మమ్మల్ని నిండా మంచుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైవే రోడ్డు పై ధర్నా నిర్వహించారు. పరిగి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ విక్రయించేందుకు పరిగి, దోమ, బొంరాస్ పేట్, పూడూర్ తదితర మండలాల రైతులు శుక్రవారం వేరుశనగ దాన్యం వ్యవసాయ మార్కెట్ కి తీసుకువచ్చారు. శుక్రవారం వేరుశనగ ధాన్యం క్వింటాలుకు 7,830 ధరకు కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేశావు. శనివారం అదే కమిషన్ ఏజెంట్లు వేరుశెనగ పంట అధికంగా రావడంతో క్వింటాలకు 1,830 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తామంటూ ధర నిర్ణయించారు. దీంతో ఆగ్రహించిన రైతులు హైవే రోడ్డుపై వివేకానంద స్టాచ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.

తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించి వేరుశెనగ ధాన్యం కొంటేనే ధర్నా విరమిస్తామంటూ భీష్మించు కూర్చున్నారు. సుమారు గంటన్నర పాటు హైవే రోడ్డుపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి పరిగి మార్కెట్ కు వచ్చి రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. రైతుల జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి తో మాట్లాడుతూ వెయ్యికి నాలుగు రూపాయల చొప్పున తీసుకుంటూ, తత్పత్తి లేకుండా బుక్కచిట్టి లిస్టు, సంచి తరుగు పేరుతో రెండు కిలోలు అదనంగా తీసుకుంటూ మమ్మల్ని నిండా ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ముద్దాయిపేట గ్రామానికి చెందిన రైతు గోపాల్ 6 నెంబర్ కమిషన్ ఏజెంటు 1000కి 4.5 కమిషన్ వసూలు చేసి మమ్మల్ని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుకాణదారు పై చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ డైరెక్టర్ సారంగపాణి రైతులకు సూచించారు. పరిగి మార్కెట్లో జరుగుతున్నావు కదా పై ఆరా తీయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, పరిగి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జరుపుల శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ అధికారిని కోరారు. అనంతరం రైతులను సముదాయించి 7400కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసేలా ధర నిర్ణయించి బీట్లు నిర్వహించారు.

Next Story

Most Viewed