- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సమస్యలు ఫుల్…అధికారులు నిల్
దిశ బంట్వారం: వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసే రుణమాఫీ విధివిధానాల పట్ల పూర్తి అవగాహన లేని రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మండల పరిధిలోని చాలా మంది రైతులకు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రైతు రుణమాఫీ లో భాగంగా రుణమాఫీకి నోచుకోని రైతులు ఎందరో ఉన్నారు. రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో రైతులు అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవటమే తప్ప వేరే ప్రయోజనం లేకుండా పోయింది.
సంబంధిత అధికారులు కార్యాలయాల్లో ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం రైతులకు శాపంగా మారింది. వాస్తవానికి అధికారులు ఏ సమయానికి కార్యాలయానికి విధులకు వస్తున్నారో తెలియక రైతులు ప్రతి రోజు రైతు వేదిక చుట్టూ తిరిగి వెనుదిరగాల్సి వస్తుందని రైతులు అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి అధికారులపై చట్టపర చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయాల్లో సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని, రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నారు.