- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల అభివృద్ధే ధ్యేయం: ఎంపీ రంజిత్ రెడ్డి
దిశ, పరిగి: రైతుల అభివృద్ధే ధ్యేయమని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో రూ. 98 లక్షలతో నిర్మించిన గోదాంను గురువారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగకరంగా ఉండేలా గోదాం నిర్మించారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఈ గోదాముల్లో నిల్వచుంకునే అవకాశం ఉంటుందన్నారు. 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము రాఘవాపూర్ గ్రామంలో నిర్మించుకోవడం నిజంగా మీ అధృష్టమన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్దే ధ్యేయంగా వ్యవసాయ రంగంలో ఎన్నోమార్పులు తీసుకువచ్చారన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాము నిర్మించేందుకు రూ.20 లక్షలు సహకార బ్యాంకు, మిగతా 78 లక్షలు డీసీసీబీ బ్యాంకు ద్వారా రుణం అందించి కట్టించామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీపీ కరణం అరవింద్ రావ్, జెడ్పీటీసీ బేతు హరిప్రియ, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, డీజీఎం సత్య ప్రసాద్, బ్యాంకు మేనేజర్ నర్సింహులు, కె.బాలకృష్ణ, గ్రామ సర్పంచ్ నల్క జగన్, పీఏసీఎస్ డైరెక్టర్లు పి.హన్మంత్ రెడ్డి, బోజ్యా నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.