- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ కాలం పొడగింపు
దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 11, 2021న చైర్మన్ వైస్ చైర్మన్ ల తో పాటు 12మంది డైరెక్టర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవడంతో, మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి అందాయి.
దీంతో చైర్మన్ గా నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తోటగిరి యాదవ్ , డైరెక్టర్లుగా నిరంజన్, నరసింహ గౌడ్, సుభాష్, చంద్రశేఖర్, రమేష్, లయక్ అలీ, కృష్ణయ్య, శ్రీనివాసులు, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, ప్రైమరీ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ మాడ్గుల చైర్మన్, డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మహేశ్వరం కొనసాగనున్నారు. చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్ స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ప్రస్తుత పాలకవర్గాన్ని ఆరు నెలలు పంపించినందుకు మంత్రి నిరంజన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.