- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి- Minister Srinivas Goud
దిశ శంషాబాద్ : నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన జిమ్ సెంటర్ ను సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.
సందర్భంగా మాట్లాడుతూ... ఎంతో బిజీగా ఉండే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, ఉదయాన్నే లేచి ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం, యోగ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామం వార్డులలో పార్కు స్థలాలు ఏర్పాటు చేసి అందులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు అజయ్, మేకల వెంకటేష్, ఆయిల్ కుమార్, జహంగీర్ ఖాన్, నాయకుడు గణేష్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నీరటి రాజు, సంతోష్ గౌడ్,ప్రభాకర్, కొనమొల శ్రీనివాస్, విఠల్ గౌడ్,అంజద్, అస్సాం, తాజ్ బాబా, రఫీక్,బుచ్చి రెడ్డి,నందు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.