- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యామిలీ గుర్తింపు కార్డులతో అందరికీ సమన్యాయం : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
దిశ,ఆమనగల్లు: అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని,అందులో భాగంగా ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ గుర్తింపు కార్డులను అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా గురువారం ఆమనగల్లు మున్సిపాలిటీ కేంద్రంలోని విటాయిపల్లిలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి,రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ గోపి రామ్ పాల్గొని, రాష్ట్రంలో అత్యుత్తమ విధానంలో సర్వే నిర్వహించి డిజిటల్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
ప్రతి ఇంటికి తాగు నీరు అందాలి..
మండలంలోని వివిధ గ్రామ ప్రజలకు నీటి సరఫరాను విడుదల చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆమనగల్లు,కడ్తాల్ మండలంలోని గ్రామపంచాయతీ నీటి సరఫరా సిబ్బందికి రాంనుంతల రైతు వేదిక వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులలో గురువారం ఎమ్మెల్యే పాల్గొన్నారు.