దిశ ఎఫెక్ట్.. స్పందించిన జిల్లా లీగల్ చైల్డ్ అధికారులు

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్.. స్పందించిన జిల్లా లీగల్ చైల్డ్ అధికారులు
X

దిశ, తాండూరు : లైంగిక దాడికి గురైన బాలికకు వికారాబాద్ జిల్లా లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అండగా నిలిచారు. ఈనెల 24వ తేదీన దిశ దినపత్రికలో " బాలికపై పలుమార్లు లైంగికదాడి అని ప్రచురితమైన వార్తకు జిల్లా లీగల్ చైర్డ్ అధికారులు స్పందించారు. బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నగేష్ అనే వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాసిన బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో మూడు నెలల గర్భం దాల్చింది.

బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం దొరకలేదని వాపోయారు. దీంతో ఈనెల 24వ తేదీన దిశ దినపత్రికలో" బాలికపై పలుమార్లు లైంగికదాడి "అనే ప్రచురమైన వార్తకు జిల్లా లీగల్ చైర్డ్ అధికారులు స్పందించి స్వయంగా బాలిక ఇంటికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చేకూర్చి, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేపట్టారు.

జిల్లా అధికారులు రంగంలోకి దిగడంతో నేరానికి పాల్పడిన యువకుడిపై బషీరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి నరేష్ తెలిపారు. అనంతరం నరేష్ దిశ విలేకరులతో మాట్లాడుతూ.. బాలిక కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.బాలలకు జరుగుతున్న అన్యాయాలపై పరిరక్షణ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు లీగల్ అడ్వకేట్ తెలిపారు.



Next Story

Most Viewed