- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్: స్థలం కబ్జా చేసి వేసిన రోడ్డు తొలగింపు..
దిశ, శంకర్పల్లి: దిశ కథనానికి నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు. ఆదివారం ‘దిశ’ దినపత్రికలో చెరువులో నుంచి రోడ్డు ‘కబ్జా కోరల్లో సింహ చెరువు’ అనే కథనం రాగా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు. నీటిపారుదల శాఖ డీఈ పరమేశ్వర్ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం ఉదయం జన్వాడలోని సింహచెరువు వద్దకు వెళ్లి అందులోని రోడ్డును జేసీబీ సహాయంతో తవ్వి వేశారు.
సింహచెరువులో అక్రమంగా సుమారు 200 మీటర్ల దూరం రోడ్డు వేయగా, నీటిపారుదల శాఖ ఏఈ రాధిక, వర్క్ ఇన్ స్పెక్టర్ లింగంలు జేసీబీ సహాయంతో దాదాపుగా 15 కందకాలు( గోతులు) తీయించారు. రోడ్డుపై ఎవరు వెళ్లడానికి వీలు లేకుండా పెద్ద గుంతలు తీయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా వేసిన రోడ్డులో నీటిపారుదల శాఖ అధికారులు దగ్గర ఉండి పనులు చేయించారు. వారితో పాటుగా రెవిన్యూ ఇన్ స్పెక్టర్ తేజ ఉన్నారు. చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఈ రాధిక హెచ్చరించారు. చెరువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.