- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలి: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
దిశ, తాండూరు రూరల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు పండగలా నిర్వహించాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణం దుర్గా గ్యాండూర్ హాల్ లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూన్ 2 వ తేదీన ప్రారంభమై 21 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, నేడు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, డీఎస్పీ శేఖర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.