- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపీ సారూ స్పందించాలి..
దిశ ప్రతినిధి, వికారాబాద్ : గొట్టిముక్ల గ్రామంలో గుంతలు, బురద మయంగా మారిన రోడ్డుతో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నాము. మా సమస్య తెలిసిన కూడా ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరం అని గొట్టిముక్ల గ్రామా ఎంపీటీసీ గోపాల్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో మంచిగా ఉన్న రోడ్డు కాస్త దాదాపు ద్వంసం అయ్యింది. దానికి ప్రధాన కారణం అంతారం గ్రామ పరిధిలో గల ఎంపీ రంజిత్ రెడ్డి కోళ్ల ఫారంకు దాన, ఇతర వస్తువులు తీసుకెళ్తున్న లారీలు మాత్రమే అని గ్రామస్తులు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు.
మా గ్రామానికి బైకులు, ఆటోలు, కార్లు తప్ప వేరే పెద్ద వాహనాలు వచ్చేవి కావని, ఎంపీ రంజిత్ రెడ్డి కోళ్ల ఫారం ఏర్పాటు చేసిన దగ్గర నుండే అధిక లోడు వాహనాలు వెళ్తున్నాయని వాపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎంపీ స్పందించి మా గ్రామంలో రోడ్డు బాగుచేయడంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని గొట్టిముక్ల గ్రామా ప్రజలు కోరుతున్నారు.
గొట్టిముక్ల గ్రామంలోని రోడ్డుతో గ్రామ ప్రజలు సతమతం అవుతున్నారని దిశ దినపత్రికలో వార్త ప్రచురణ అయినప్పటికీ ఎంపీ స్పందించకపోవడం బాధాకరం. రాజేంద్రనగర్ లాంటి నియోజకవర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఎంపీ, వికారాబాద్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ గోపాల్ ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఎంపీ స్పందించి తమ గ్రామంలోని రోడ్డును బాగు చేయాలని కోరారు. అలాగే పంచాయితీరాజ్ శాఖా మంత్రి రాష్ట్రంలో అన్ని గ్రామాలు అద్దంలాగ మెరుస్తున్నాయని గొప్పలు చెబుతున్నాడు. కానీ తమ గ్రామంలో రోడ్డెక్కాక, మోరీలు ఎక్కడికక్కడ నిండి గ్రామం మురుగు మయంగా మారాయని అసహనం వ్యక్తం చేశాడు.