సైబర్ నేరాలు పెరిగాయి..

by Kalyani |
సైబర్ నేరాలు పెరిగాయి..
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. 2024 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన వార్షిక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. “ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో జరిగిన నేరాల వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే 2023లో జిల్లాలో 3,600 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2024లో 4,230 కేసులు నమోదయ్యయని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 630 కేసులు పెరిగాయి. వీటిలో ప్రధానంగా సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా ఉంది అని అన్నారు. అలాగే జిల్లాలో భూమి విలువ పెరగడం కారణంగా చిన్నచిన్న కారణాలతో గొడవలు పడిన కేసులు కూడా ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయి. జిల్లాలో 98శాతం మిస్సింగ్ కేసును చేయించడం జరిగింది. ఇప్పటికే 5 కేసుల్లో జీవిత ఖైదు విధించడం జరిగింది. ఏకంగా 150 కేసుల్లో నిందుతుడిగా ఉన్న ఓ నేరస్తుడిని ఈమధ్య అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.

2023లో యాక్సిడెంట్స్ కేసులు 189 అయితే, 2024లో 169 జరిగాయి. రోడ్డు భద్రత చర్యలు తీసుకొని రోడ్డు యాక్సిడెంట్ లను కొంతవరకు తగ్గించగలిగాము. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 24 రోడ్డు ప్రమాదాలు, 34 మరణాలు తగ్గాయి. ఆపరేషన్ మస్కాన్ ద్వారా వెట్టిచాకిరి చేస్తున్న 168మంది చిన్నారులను రిస్క్ చేయడం జరిగింది. ఏడుగురిపై ఈవిటీజింగ్ కేసులు నమోదు చేశాం. 19 గ్రామాలకు నూతనంగా దుద్యాల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలోని తాండూర్, వికారాబాద్ పట్టణాలలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే లగచర్ల కేసులో 71 మంది నిందితులను గుర్తించగా, 37 మందిపై కేసులు నమోదు అయ్యాయి అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానం ఇచ్చారు.”

అలాగే నూతన సంవత్సరం సందర్భంగా వికారాబాద్ అనంతగిరి ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్ యజమానులు తప్పనిసరిగా అనుమతులు తీసుకొని చట్టానికి లోబడే ఈవెంట్స్ నిర్వహించాలని హెచ్చరించారు. అనుమతులు లేకుండా డీజేలు పెట్టొద్దు అన్నారు. యువకులు రైడ్లు, త్రిబుల్ రైడ్ లు చేయొద్దని, పోలీసులు నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం అన్నారు. చివరగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, జిల్లా పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story