- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై హద్దులు దాటిన ప్రేమికులు
దిశ, బడంగ్ పేట్ : నడిరోడ్డు పై ప్రేమికులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాము ప్రైవేట్‌గా ఉన్నామా? పబ్లిక్‌లో ఉన్నామా? అన్న ధ్యాసే మరిచారు. పెళ్లయ్యాక పడకగదిలో చూసుకోవాల్సిన వ్యవహారం నడిరోడ్డుపై రన్నింగ్ బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ న్యూసెన్స్ చేశారు. ఈ ఘటన పహాడిఫరీఫ్ ప్రాంతంలో ఒక కెమెరాకు చిక్కింది. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలలోకి వెళితే... హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది.
చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక ప్రేమలోకంలో ఉన్నామనుకున్నారేమో తెలియదు కానీ యువతి బైక్ ట్యాంకు మీద రివర్స్‌లో కూర్చొని యువకుడికి ముద్దులు పెడుతూ కనిపించింది. ఇదంతా చూస్తున్న ఇతరులు సిగ్గుతో తలవంచుకోగా... మరొక వాహనాదారుడు మాత్రం వీరి వెకిలిచేష్టలను తన సెల్‌ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇలాంటి వికృత చేష్టలను చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు వారు ప్రేమికులా? పెళ్లి చేసుకున్న నూతన జంటనా? అని ఇంకా తెలియాల్సి ఉంది. రోడ్డు మీద న్యూసెన్స్ చేసిన ఈ జంట ఎవరు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.