- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాండూరులో లీడర్ లేక కాంగ్రెస్ కేడర్ ఆగమాగం
దిశ, తాండూరు రూరల్ : ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌కు ఇప్పుడున్న పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని ఎవరూ ఊహించి ఉండరేమో? పార్టీకి సారథ్యం వహించే వారు సమర్థులు కాకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందన్న భావన కలిగేలా కాంగ్రెస్ అధినాయకత్వ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ మహారాజ్ కుటుంబం ఏకతాటిగా పరిపాలించారు. మారిన కాలానికి.. రాజకీయానికి తగ్గ ట్లుగా మారకపోవటం.. ఆ పార్టీ చేసిన పెద్ద తప్పు గా చెప్పాలి.
అందుకు మూల్యంగా తాజాగా పరిస్థితి ఎదురైంది. ఇదంతా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆగమా గం అవుతోంది. తాండూరులో ఒకపుడు ఒక వెలుగు వెలిగిన హస్తం పార్టీకీ..ఇప్పుడు సరైన నాయకుడే కరువయ్యాడు..! దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గట్టేక్కలో తెలియక నేతలు, కేడర్ అయోమయానికి గురవుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు కనీస గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి వెలకొండంటున్నారు. దాంతో, ఎన్నికలకు ముందే తాండూరులో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే చర్చలు జరుగుతోంది.
రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ టాప్..!
ఎన్నో ఏండ్ల చరిత కలిగిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ప్రస్తుతం వృధాప్యంలోకి అడిగేడుతున్నట్లు కనిపిస్తుందని కొందరి వాదనలు వినిపిస్తున్నాయి. 1962నుంచి 1989వరకు ఏకథటిగా ఏడుసార్లు వరుస 2004,2018లో రెండు సార్లూ మొత్తం 9 సార్లూ విజయాలను కైవసం చేసుకున్న హస్తనికి దుస్థితి ఏంటి..? 27ఏళ్లు తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఛతికిలా పడడానికి గల కారణాలేంటి అనే సందేహాలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతున్న పార్టీ ప్రతిష్టను కాపాడడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. తాండూరులో కాంగ్రెస్ పార్టీ అంటే నమ్ముకున్న వాళ్లకు జీర్ణంచుకోలేని పరిస్థితి వెంటాడుతుంది.
నేతలు కావలెను!
ప్రధానంగా కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉన్న నేతలకు భరోసా చెప్పాలి. అయితే గతంలో కాంగ్రెస్‌లో వెలుగొందిన నేతలు ఇప్పటికే ఇతర పార్టీల్లో మంచి స్థానాల్లో ఉండటంతో ఎవరిని కలవాలనేది చర్చనీయాంశంగా మారింది. అయితే తాండూరులో కాంగ్రెస్ పార్టీకి అనుకులంగా పార్టీలోకి వచ్చే నేతలు దాదాపు ఎవరూ లేని పరిస్థితి. అటు పాత నేతలు కానీ, ఇటు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న కొత్త నేతలు కానీ జిల్లాలో కనిపించని పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఈ నియోజకవర్గనికి డబ్బు ఖర్చు పెట్టే నేతల కోసం అన్వేషణ సాగుతోంది.
కాంగ్రెస్ కేడర్ ఎక్కడ?
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ తర్వాత హస్తానికి హ్యాండిచ్చి కరెక్కేశారు. గత కొన్ని ఏండ్లగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నాయకులు,కార్యకర్తలు కూడా ఆయనతోపాటు కరెక్కేశారు. దీంతో తాండూర్ లో కాంగ్రెస్ డీలా పడటంతో.. వార్ వన్ సైడెనంటూ బిఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం తాండూరులో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించిన బిఆర్ఎస్.. స్థానికంగా మంచి పట్టు సాధించింది. అప్పటినుండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ రాజకీయాలను నడిపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్యగా మారింది.అసలు తమకు బీజేపీ పోటీ కాదంటున్నారు.