- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైంపాస్ చేస్తున్నడు.. అది ఎమ్మెల్యే స్థాయి కాదు
దిశ, వికారాబాద్: ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశాడు. శుక్రవారం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలో డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్రోలర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేవడం మరిచిన స్థానిక ఎమ్మెల్యే ఊరూరా తిరుగుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి టైంపాస్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ చెక్కులు అధికారులు కూడా పంపిణీ చేయగలరని, అలాంటి చిన్న చిన్న పనులు చేయడం తనస్థాయి కాదని ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు.
మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విడుదలైన నిధులతోనే వికారాబాద్ మున్సిపాలిటీని అరాకోరా అభివృద్ధి చేస్తున్నారు తప్ప, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వికారాబాద్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రత్యేక నిధులు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాంటి మీరు మున్సిపాలిటీ లెక్కలు ఎలా అడుగుతారని ఎద్దేవా చేశారు. నిధులు తీసుకురాని మీరు ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలు లేదని, రాజీనామా చేస్తేనే వికారాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చి నిధుల వరద పారుతుందని అన్నారు. ప్రజల తలరాతలు మారుతాయని స్థానిక ఎమ్మెల్యే పై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, రత్నారెడ్డి సత్యనారాయణ, అనంత్ రెడ్డి, కౌన్సిలర్లు జైదుపల్లి మురళి, వేణుగోపాల్ రెడ్డి, కాంసెన్సీ మెంబర్షిప్ ఇంచార్జ్ శుభాష్ నాయక్, చేవెళ్ల పార్లమెంట్ మెంబర్షిప్ ఇంచార్జ్ చామల రఘుపతి రెడ్డి, చాపల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.