- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలకొండపల్లిలో అంబరానంటిన సంబరాలు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ బైక్ ర్యాలీ
దిశ, తలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిది సంవత్సరాల పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలకొండపల్లి మండల కేంద్రంలోని మండల పార్టీ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని జాతీయ జెండాను ఆవిష్కరించి, సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులు ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, భగవాన్ రెడ్డి, గుజ్జుల మహేష్‌లు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ పెద్ద మనసుతో రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేశారని, కేంద్ర మంత్రి కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి లాంటి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని విషయాన్ని ప్రజలకు వివరించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీని వెంటనే అందిస్తామని వారు హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల గారడీ ప్రభుత్వం అని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చిన పాపాన పోలేదని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన ఐదు హామీలను అమలు చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌కు ఎవరు సాటి రారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, భగవాన్ రెడ్డి, గుజ్జుల మహేష్, రవీందర్ యాదవ్, సర్పంచ్ శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ రాములు, వెంకటయ్య, అజీమ్, హరీఫ్ జనార్దన్ రెడ్డి, విష్ణు, రమేష్, చెన్నకేశవులు, అనిల్, వెంకటయ్య, ప్రవీణ్ రెడ్డి, గౌస్, నరేష్ ,శంకర్, శశిధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గోపి, శ్రీను, నరసింహ, భాస్కర్ ,రవి, శివ తదితరులు పాల్గొన్నారు.