పేద‌లకు సీఎం రిలీఫ్ ఫండ్‌ వ‌రం

by Sridhar Babu |
పేద‌లకు సీఎం రిలీఫ్ ఫండ్‌ వ‌రం
X

దిశ, గండిపేట్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు వ‌ర‌మ‌ని రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యులు టి.ప్ర‌కాష్‌గౌడ్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ల‌బ్ధిదారుడు ర‌వీంద‌ర్‌కు ఎమ్మెల్యే అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని అన్నారు. ఎవరికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకురావాల‌ని, ప‌రిష్కారానికి త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేష్, ఎంపీటీసీ వెంకటేష్, బ్యాగరీ విష్ణువర్ధన్, బక్కని సాయికుమార్, దాసరి రాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed