- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతన్నకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
దిశ, ఆమనగల్లు: అన్నం పెట్టే రైతన్నకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో రైతుల సమక్షంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, స్పెషల్ కమిషనర్ హనుమంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఆమనగల్లు మండలంలోని 4 రైతువేదిక భవనాలలో, మాడ్గుల మండలంలోని 7 రైతు వేదిక భవనాలలో వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాలలో వ్యవసాయ శాఖ అధికారులు శ్రీలత, అరుణకుమారి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు పత్య నాయక్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ కమ్లి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జోగు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.