చదవాలంటే నడవాల్సిందే..!

by Aamani |
చదవాలంటే నడవాల్సిందే..!
X

దిశ, తాండూరు రూరల్ : విద్యార్థులు చదువుకోలాంటే కాలినడకన వెళ్లాల్సిందే.. పలు గ్రామాలకు ఆ సమయంలో బస్సు సౌకర్యం లేక ఈ పరిస్థితి దాపురించింది. ఎండాకాలం వచ్చిందంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఒంటిపూట బడి పెట్టి మధ్యాహ్నం ఇండ్లకు పంపిస్తుంటారు. కానీ తాండూరు మండల చెంగోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి పర్వతపూర్, చింతామణి పట్నం గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం ఒంటి పూట బడికి కాలినడకన వెళ్తున్నారు.ఆయా గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు మిట్ట మధ్యాహ్నం వారి ఇండ్లకు వెళ్ళాలంటే ఎండల్లో సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు.

మరోవైపు కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత అల్లపూర్ సమీపంలో పాలిష్ యూనియన్ లో లోకల్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు.వలస కార్మికుల పిల్లలు గౌతాపూర్ ప్రభుత్వ పాఠశాల బడికి వెళ్తున్న విద్యార్థులకు పాదరక్షలు లేకుండా సుమారు 1 కిలోమీటర్ వరకు నడిచే వెళ్తున్నారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు గౌతపూర్ ప్రభుత్వ పాఠశాల నుంచి చించోలి నేషనల్ హైవే రోడ్డుపై చిన్న పాదాలకు పాదరక్షలు లేకుండా కాలినడకన వెళుతున్నారు. లేకుండా కొంతమంది తల్లిదండ్రులు వారి సొంతం వాహనాలు లేదా ప్రైవేటు వాహనాల్లో విద్యార్థులు ఇండ్లకు వెళ్లే సౌకర్యం కల్పించుకుంటారు. కానీ పేద కుటుంబాల విద్యార్థులు మాత్రం ఒంటిపూట బడి ముగించుకొని ఎండలో కాలినడకన వెళ్తున్నారు.ఇదేమైనా ఆయా గ్రామాల నుంచి చెంగోల్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం కూడా బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎండలో కాలినడక ప్రయాణం..: చింతామణి పట్నం గ్రామం 6వ తరగతి విద్యార్థి భవాని

15 తేదీ నుంచి చింతామణి పట్నం నుండి చెంగోల్ గ్రామంలో చదువుకోవడానికి ఉదయం కాలినడకన వెళ్తాం.. బడి నుంచి ఇంటికి ప్రతిరోజు ఎండల కాలినడకని ప్రయాణం చేస్తాం.

చెప్పులకు పైసలు లేవు : 2 తరగతి విద్యార్థి గుణమ్మ

కాళ్లకు చెప్పులు లేకపోవడంతో బడి నుండి ఇంటికి వెళ్లేటప్పుడు పాదాలు ఎండకు కాలుతున్నాయి.రోజు అలాగే వెళుతున్నాం.మా డాడీకి అడిగితే పైసలు లేవు అన్నాడు.

బస్సు సౌకర్యం కల్పించాలి : చింతామణి గ్రామం 7వ తరగతి విద్యార్థి అక్షయ

చెంగోల్ ప్రభుత్వ బడికి వెళ్లి వచ్చే సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రతిరోజు నడిచి వెళ్లాలంటే కాళ్లు నొప్పి పుడుతున్నాయి.

Next Story