CM Revanth Reddy : రాష్ట్రంలో వడగండ్ల వాన... సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

by M.Rajitha |
CM Revanth Reddy : రాష్ట్రంలో వడగండ్ల వాన... సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో నేడు వడగండ్ల వాన(Hailstrom) భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు. వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్. నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు(Rains) కురవనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మార్కెట్ యార్డ్స్ లో ఉన్న పంటలు తడిసిపోకుండా చూడాలని, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్ల తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanthi kumari)ని ఆదేశించారు.

Next Story

Most Viewed