- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం..
దిశ, మర్పల్లి : నేరాల నియంత్రణలో గ్రామాల సంరక్షణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని వికారాబాద్ జిల్లా ఎస్పీఎన్ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని కొత్తలపూర్, కోటమరపల్లి, మర్పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సీసీకెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. గ్రామస్తులు పోలీసులు స్నేహంతో ఉండి ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు.
సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో నేరగాళ్ల ఆటలు సాగవని అన్నారు. దొంగతనం కేసులను, ఆక్సిడెంట్ కేసులలో, శాంతి భద్రతలను విఘాతం కలిగించిన కేసులను, ఈవ్ టీజింగ్ కేసులను అనేక కేసులను ఛేదించామన్నారు. యువకులు క్రిమినల్ కేసులలో పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని పాల్పడి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. పెద్దలు ఉపాధ్యాయులు దయచేసి అవగాహన కల్పించాలని, వారి వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ప్రజలందరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.
మర్పల్లి మండలంలో 19 గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మిగతా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ వెంకటేశం, ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్, మోమిన్ పెట్ ఎస్సై విజయ్ ప్రకాష్ నవపేట్ ఎస్సై, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి కో ఆప్షన్ సభ్యులు సోయల్ షరీఫ్ రాచన్న కొతులపుర్ గ్రామ సర్పంచి ప్రభాకర్, సిరిపురం గ్రామ సర్పంచి మల్లయ్య చంద్రమౌళి శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.