- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెగిపోయిన రోడ్డు…రాకపోకలకు అంతరాయం
by Kalyani |
X
దిశ, నందిగామ : నందిగామ మండల కేంద్రం నుంచి వీర్లపల్లికి పోయే మార్గమధ్య వాగుపై ఉన్న రోడ్డు ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. ఈ రోడ్డు గుండా చాలామంది మండల కేంద్రానికి వస్తూ.. పోతుంటారు. వీర్లపల్లి నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ ఈ రోడ్డు మీదనే ప్రయాణిస్తుంటారు. మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో చుట్టూ వీర్లపల్లి నుంచి అప్పారెడ్డి గూడ మీదుగా చంద్రయాన్ గూడా చౌరస్తా నుంచి సుమారు 8 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Advertisement
Next Story