- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాలలో వెలుగులు.. ఎనుముల తిరుపతిరెడ్డి
దిశ, బొంరాస్ పేట్ : మత్సకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్ల కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎనుముల తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం బొంరాస్ పేట్ మండలంలోని ఏర్పుమాళ్ళ కాకరవాణి ప్రాజెక్టులో ప్రత్యేక పూజలు చేసి, కడా ప్రత్యేకాధికారి కే. వెంకటరెడ్డితో కలిసి ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు జీవనోపాధి కల్పించి, వారి జీవితాలలో వెలుగులు నింపాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమన్నారు.
చేప పిల్లలను పెంచి, వాటి ఉపాధిని పొందాలన్నారు. ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో 100 శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య మాట్లాడుతూ ఒక లక్ష 13 వేల 672 చేప పిల్లలను 1 లక్ష 80 వేల ఖర్చుతో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, ఎంపీడీవో వెంకన్నగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిములుగౌడ్, నాయకులు రాంచంద్రరెడ్డి, వెంకట్ రాములు గౌడ్, అంజిల్ రెడ్డి, మెరుగు వెంకటయ్య, నరసింహనాయుడు, దేశ్యా నాయక్, రాములు, మల్లేష్, కిష్టప్ప, సంతోష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.