మైనింగ్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం

by Sridhar Babu |   ( Updated:2022-11-25 15:03:10.0  )
మైనింగ్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం
X

దిశ, యాచారం : మండలంలోని మొండి గౌరెల్లి గ్రామంలో మైనింగ్ ఏర్పాటు విషయమై నేడు జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ అన్నారు. రైతులు , ప్రజలతో కలిసి మైనింగ్ జోన్ ప్రాంతాన్ని శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. అనంతరం రైతులతో కలిగి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు . ఈ సందర్భంగా కర్నాటి రమేష్ గౌడ్ మాట్లాడుతూ మొండి గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 141 ,144 గల నెంబర్లలో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయడాన్ని , అధికారుల తీరుపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న సహజసంపదను కోల్పోతామని అన్నారు. రేపు జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ సభకు అడ్డుకుంటామని ఆయన తెలిపారు. మైనింగ్ ఏర్పాటను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా యాచారం మండలంలో మైనింగ్‌జోన్‌ ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా , సర్పంచ్ బండిమీది కృష్ణ , నాయకులు పెరుమాండ్ల రమేష్ , వెంకటేష్, సత్యపాల్, కల్లూరి శివ, కాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed