Bhatti Vikramarka : ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం

by Aamani |
Bhatti Vikramarka : ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం
X

దిశ,నందిగామ : ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని నందిగామ మండలం కన్హ శాంతి వనం ను సందర్శించారు.. అనంతరం వెల్ నెస్ బై హార్ట్ ఫుల్ నెస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాట్ ఫుల్ నెస్ , ఆయుష్ తో కలిసి అన్ని రకాల చికిత్సలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. హైడ్రో థెరపీ, ఆయుర్వేదం నేచురోపతి, హోమియోపతి, పోలారిటి, యోగ కేంద్రం వాటికి సంబంధించిన అత్యంత అరుదైన పరికరాలు సదుపాయాలు కలిగి ఉండడంతో పేద ప్రజలకు ఇవి ఎంతో దోహద పడతాయన్నారు. అన్ని రకాల చికిత్స కేంద్రాలను ఒక స్థలంలో పెట్టడం చాలా మంచిదన్నారు. ఈ చికిత్స కేంద్రాల ద్వారా పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజి. స్థానిక ఎమ్మెల్యే.వీర్లపల్లి శంకర్. ఆచార్య డాక్టర్ శ్రీ వర్మ. వెల్ నెస్ చీప్ మెడికల్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story