ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : తాండూరు ఎమ్మెల్యే

by Aamani |
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : తాండూరు ఎమ్మెల్యే
X

దిశ,తాండూరు : వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. తాండూరు పట్టణంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే తనిఖీ చేశారు.ఆసుపత్రిల్లో వార్డులను సందర్శించి,వైద్యుల పనితీరు గురించి అడిగి హాజరు పట్టికను పరిశీలించారు.రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రోగుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.నర్సులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది కావాలని డాక్టర్ కోరగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి , పోలీస్ సిబ్బందిని నియమిస్తామని జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అధికారులు , వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తన దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో కంటే మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు తగిన ఏర్పాటు చేశామని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో మెలగాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, పరిశుభ్రత పాటించడంలో సిబ్బంది అశ్రద్ధ వహిస్తున్నారని, ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్ష కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి,కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, మాజీ జడ్పీటిసి థారసింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్, DHO ప్రదీప్ కుమార్, రామో డాక్టర్ అనిల్ కుమార్,ఆయా శాఖ అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed