- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
దిశ,బొంరాస్ పేట్ :కొడంగల్ పట్టణంలో భారీ వర్షాల నేపథ్యంలో,కల్వర్ట్ ల ద్వారా వెళ్లే వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఆదివారం కొడంగల్ పట్టణంలో ఆర్ అండ్ బి,మున్సిపల్,ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో రోడ్డుపై ఆగి ఉన్న నీటిని తొలగింప చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ సూచనల మేరకు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రజలు ఎవ్వరు కూడా చెరువుల దగ్గరకు వెళ్లరాదని, ఉధృతంగా ప్రవహిస్తున్న ఆలుగును దాటరాదని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కొడంగల్ చెరువులో కలిసే నాలాలను,నస్కల్ వాగును, పర్సపూర్ వెళ్లే వాగులలో వరద ఉధృతిని పరిశీలించారు. కలెక్టర్ వెంట కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి,తహసీల్దార్ విజయ్ కుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్,తదితరులు ఉన్నారు.