- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, హిందువులపై దాడులు పెరిగాయి : బండి సంజయ్
దిశ, శంషాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాలపై, హిందూ యువకుల పై దాడులు పెరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గత మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం ముందు ఉన్న నవగ్రహ విగ్రహాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటనను శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాల లక్ష్యంగా దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఎక్కడ దాడులు జరిగినా పిచ్చోడు చేశాడని చెప్పి చేతులు దులుపుకోవడం పొరపాటు గా మారింది అన్నారు. పిచ్చోళ్లకు హిందూ దేవాలయాలు దొరుకుతాయా మసీదులు చర్చిలు కనిపించవా అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి ఇప్పటివరకు 100 హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే దాడులు పెరిగాయి అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే కొత్త దేవాలయం నిర్మిస్తానని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హిందువులు అంత బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా మీరు ఇచ్చే డబ్బులకు హిందువులు ఎవరు ఆశపడే వారు కారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నేడు యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపితే బాగుండేది అన్నారు. దాడులు జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడమే తప్ప నిజమైన నిందితుడిని పట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవన్నారు. దాడి చేసిన వారిని హిందువులే పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరుగుతుందని ఇప్పటికైనా పోలీసులు దేవాలయాలపై దాడి చేసిన అసలు నిందితులని పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు.
హిందూ దేవాలయాలపై దాడి జరిగినప్పుడు స్పందించిన వాడే నిజమైన హిందువులు అన్నారు. బీజేపీ పార్టీ హిందువుల పక్షాన ఉండి పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్, బుక్క వేణుగోపాల్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్, కుమార్ యాదవ్, దేవేందర్, వై శ్రీధర్, మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, కొమురయ్య, సంగప్ప, శ్రీ వర్ధన్ రెడ్డి, డిఎల్ స్వామి, రాహుల్, మహేష్, కుమార్ యాదవ్, సునిగంటి సిద్దులు, తదితరులు పాల్గొన్నారు.