- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్వాసితులకు ఎకరానికి ఒక గుంట ప్లాటు కేటాయింపు
దిశ,మహేశ్వరం : కందుకూరు మండలంలోని బెగరికంచ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రీన్ ఫార్మాసిటీ భూ నిర్వాసితుల కోసం 622 ఎకరాలలో ఏర్పాటు చేసిన లే అవుట్ ను శనివారం జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
గ్రీన్ ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన లబ్ధిదారులకు ఎకరానికి ఒక గుంట ప్లాట్లను కేటాయిస్తుందన్నారు. 622 ఎకరాలలో అద్భుతమైన మౌలిక సదుపాయాలతో నూతన ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహింపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, ఇంజనీరింగ్ , రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.